మాస్ మహారాజా రవితేజ కుమారుడు మహాధన్ ప్రస్తుతం ప్రభాస్ ‘స్పిరిట్’ మూవీ కోసం వర్క్ చేస్తున్నాడు. తాజాగా రవితేజ కూతురు మోక్షద కూడా సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు శివ నిర్వాణతో రవితేజ చేయనున్న ఈ సినిమాకు ఆమె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నట్లు సమాచారం. ప్రొడక్షన్, బడ్జెట్‌కు సంబంధించిన కార్యకలాపాలను పర్యవేక్షించనున్నట్లు టాక్.