హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చలాన్లు వేసిన విధానంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మొబైల్ ఫోన్లతో ఫొటోలు తీసి అక్రమంగా తనకు మూడు చలాన్లు వేశారని రాఘవేంద్ర చారి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. చలాన్ల కోసం పోలీసులు తమ సొంత మొబైల్ ఫోన్లను వాడుతున్నారని పిటిషనర్ తెలిపారు. దీనిపై హోం శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.