ATP: అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పోరాడిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పిలుపునిచ్చారు. కళ్యాణదుర్గంలోని ప్రజావేదికలో ఎమ్మెల్యే అమిలినేని, టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.