ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టు షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో మరో తమిళ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో బన్నీ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల బన్నీని కలిసి లోకేష్ కథను వినిపించగా.. అయన ఆసక్తి చూపినట్లు టాక్ వినిపిస్తోంది.