విశాఖ జిల్లా ఏఐటీయూసీ విస్తృత సమావేశం శుక్రవారం పౌర గ్రంథాలయంలో ఎం. మన్మధరావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎస్. వెంకటసుబ్బయ్య, డీ. ఆదినారాయణ, పడాల రమణ పాల్గొన్నారు. ఉక్కు కర్మాగారాన్ని పబ్లిక్ రంగంలోనే కొనసాగించేందుకు, కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ రద్దు వరకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని నిర్ణయించారు.