VZM: మహాత్మా జ్యోతిభా ఫూలే వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిభా ఫూలే విగ్రహం వద్ద అఖిల భారత ఓబిసీ సంక్షేమ సంఘం ఇవాళ ఘనంగా నివాళులర్పించారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులని పూలే అని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్ వరప్రసాద్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి విజయలక్ష్మి పాల్గొన్నారు.