ATP: జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ NH 544డికి సంబంధించిన భూ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. తాడిపత్రి అర్బన్, బుగ్గ, కొండాపురం తదితర గ్రామాల పరిధిలో పెండింగ్లో ఉన్న భూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు.