తమిళ హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘తేరే ఇష్క్ మే’. ఇవాళ ఈ మూవీ హిందీ, తమిళం, తెలుగులో విడుదలైంది. అయితే ఈ మూవీ హిందీ కలెక్షన్స్‌పై క్రేజీ బజ్ నెలకొంది. హిందీలో ఫస్ట్ డే ఈ మూవీకి రూ.15 కోట్లకుపైగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ మూవీలో కృతి సనన్ కథానాయికగా నటించగా.. AR రెహమాన్ మ్యూజిక్ అందించారు.