VZM: కొత్తవలస టీడీపీ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షుడు కోళ్ల శ్రీను ఆద్వర్యంలో జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాలకు హక్కుల కోసం పోరాడిన జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ముందుగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ సెల్ ఉపాధ్యక్షుడు, శివ, లెంక శ్రీను పాల్గొన్నారు.