ASR: పెదబయలు మండలం గోమంగిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని గోమంగి మండల సాధన సమితి నాయకులు కూడా బొంజుబాబు, రాధాకృష్ణ, పద్మనాభం తదితరులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం పాడేరులో జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. గోమంగి మండలం కోసం సుమారు 40ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నామని తెలిపారు.