KMM: గ్రామపంచాయతీ ఎన్నికల నియమావళిని అన్ని పార్టీలు తప్పనిసరిగా పాటించాలని సీఐ మురళి అన్నారు. ఇవాళ ముదిగొండ మండల కేంద్రంలో సీఐ ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా పోలీసులకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.