CTR: తవణంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ‘రైతన్నా మీ కోసం’ కార్యక్రమంలో పూతలపట్టు MLA డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, రైతుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లి వ్యవసాయంలో రాబడి పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను పంచసూత్రాల రూపంలో రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కూడా పాల్గొన్నారు.