భారత మహిళల జట్టు వచ్చే నెలలో సొంతగడ్డపై శ్రీలంకతో 5 మ్యాచుల T20 సిరీస్ ఆడనుంది. ఈ మేరకు BCCI సిరీస్ షెడ్యూల్ ప్రకటించింది. విశాఖ వేదికగా తొలి T20 డిసెంబర్ 21న, రెండో మ్యాచ్ 23న జరగనున్నాయి. అలాగే తిరువనంతపురంలో చివరి 3 T20లు 26, 28, 30 తేదీల్లో జరుగుతాయి. కాగా వన్డే వరల్డ్ కప్ విజయం తర్వాత టీమిండియా ఈ సిరీస్‌తోనే తొలిసారిగా మైదానంలో దిగబోతోంది.