జపాన్ విద్యా వ్యవస్థపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అక్కడ మూడో తరగతి వరకు విద్యార్థులకు హోంవర్క్, పరీక్షలు ఉండవట. నాలుగో తరగతి నుంచే పాఠాలు బోదిస్తారు. తొలి మూడేళ్లలో పిల్లలకు బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం, క్లాస్ రూమ్‌ను శుభ్రంగా ఉంచడం, ఇతరులకు సహాయం చేయడం వంటి జీవన నైపుణ్యాలను నేర్పుతారు. అయితే, ఇండియాలో నర్సరీ నుంచే పిల్లలపై ఒత్తిడి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.