KDP: సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపడం సరికాదని రాయలసీమ ఆటో యూనియన్ అసోసియేషన్ కార్మికులు ఇవాళ రాయచోటి వద్దు, కడప ముద్దు అని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లాలో రెండు మండలాలను కలపడం సమంజసం కాదన్నారు. విలీనం చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్నారు. అనంతరం తహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.