ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఆధార్ కార్డును జనన ధ్రువీకరణ పత్రంగా, పుట్టిన తేదీ రుజువుగా పరిగణించబోమని తెలిపాయి. నకిలీ ధ్రువపత్రాల వినియోగాన్ని అరికట్టేందుకు.. జనన, మరణాల నమోదు చట్టం (సవరణ) 2023కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి. ఇప్పటివరకు నకిలీ సర్టిఫికెట్లను జారీ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించాయి.