BHPL: గోరికొత్తపల్లి మండలంలో ఇటీవల కొత్తగా ఏర్పడిన బాలయ్యపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్‌గా తోట్ల తిరుపతిని గ్రామస్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇవాళ మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో అందరూ ఏకనిర్ణయంతో తోట్ల తిరుపతిని సర్పంచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా గ్రామంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.