శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమైన ‘దిత్వా’ తుఫాన్ నెమ్మదిగా కదులుతోంది. ప్రస్తుతం ట్రింకోమలీకి 80కి.మీ, పుదుచ్చేరికి 480 కి.మీ, చెన్నైకి 580 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. గడిచిన 6 గంటల్లో 8 కి.మీ వేగంతో కదిలినట్లు తెలిపింది. ఆదివారానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరం సమీపంలోకి చేరుకునే అవకాశం ఉందని చెప్పింది.