ELR: మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ కార్యాలయంలో ఇవాళ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పూలే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే ఆదర్శ నీయుడని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.