AP: రాజధాని నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని సీఎం చంద్రబాబు అన్నారు. 34 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ప్రపంచంలోనే స్ఫూర్తిదాయక ల్యాండ్‌పూలింగ్ జరిగిన ఏకైక ప్రాంతం అమరావతి అని వెల్లడించారు. ప్రధాని మోదీ వచ్చి రాజధాని పనులను పున:ప్రారంభం చేశారని గుర్తు చేశారు. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.