TG: కరీంనగర్ జిల్లాలోని మానేరు నదిపై చెక్‌డ్యామ్ కూలడంపై మాజీ మంత్రి గంగుల కమలాకర్ అనుమానం వ్యక్తం చేశారు. ఇసుక మాఫియానే ఈ డ్యామ్ పేల్చేసినట్లు అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు. దోషులను శిక్షించే వరకు పోరాడతామని వెల్లడించారు.