SRCL: వేములవాడ – అరుణాచలానికి RTC ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. DEC 6న ఉదయం వేములవాడలో బస్సు బయలుదేరి 7న కాణిపాకం, కంచి, గోల్డెన్ టెంపుల్ దర్శనం అనంతరం అదే రాత్రి అరుణాచలం చేరుకుంటుందని డిపో మేనేజర్ బోనాల శ్రీనివాస్ తెలిపారు. 8న అరుణాచల గిరిప్రదక్షిణ అనంతరం బయలుదేరి 9న జోగులాంబ దర్శనం అనంతరం బస్సు వేములవాడకు తిరిగి వస్తుందన్నారు.