MBNR: జిల్లా కేంద్రంలోని గీత హోటల్ సమీపంలో మ్యాన్ హోల్ తెరిచి ఉండటంతో వాహనదారులు, పాదాచారులు అవస్థలు పడుతున్నారు. రాత్రి సమయంలో ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు గ్రహించి ఒక కర్రకు ఎర్రబట్టను కట్టి ప్రమాద సూచికగా ఏర్పాటు చేశారు. దాదాపు రెండు నెలల నుంచి ఇలాగే ఉందన్నారు. నగరపాలక అధికారులు స్పందించి అక్కడ మ్యాన్ హోల్ మూసివేయాలన్నారు.