NLR: జిల్లాలో తుఫాన్ ప్రభావం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు ఆర్డీవో బి. పావణి పేర్కొన్నారు. సోమశిల జలాశయం నుంచి భారీగా నీటిని విడుదల చేసే అవకాశం ఉందని, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. డివిజన్ పరిధిలోని అన్ని మండలాల తహశీల్దార్లు తుఫాన్ ప్రభావాన్ని ప్రజలకు తెలియజేయాల్సిందిగా ఆదేశించారు.