MBNR: పాలమూరు యూనివర్సిటీ పీజీ కళాశాలలో శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి పురస్కరించుకుని నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీజీ కళాశాల ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, మహిళా విద్య, సమాన హక్కుల కోసం అహర్నిశలూ కృషి చేసిన మహోన్నత సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే 19వ శతాబ్దపు వేగుచుక్క అని అన్నారు.