బాలీవుడ్ కపుల్ కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. తాజాగా పాప పేరును ప్రకటిస్తూ కియారా ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది. పాపకు సారయ సిద్ధార్థ్ అని నామకరణం చేసినట్లు రివీల్ చేసింది. ఈ మేరకు ఫొటో షేర్ చేసింది. ఇక సారయ అంటే యువరాణి అని అర్థం. దీంతో నెటిజన్లు పేరు బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.