KMM: ఎర్రుపాలెం మండల పరిధిలో బనిగండ్లపాడు గ్రామంలోని నామినేషన్ కేంద్రాన్ని శుక్రవారం ఎస్సై రమేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఎవరు చేయకూడదని అన్నారు. నామినేషన్ స్వీకరణ అంశాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు వ్యవహరించాలన్నారు.