AP: అమరావతిలో ఆర్థిక పురోగతికి ఇవాళ పునాది పడిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సహాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా ఆచరణలో కనిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఒక ప్రాంతంలో బ్యాంకింగ్ స్ట్రీట్ ఏర్పాటు కావడం దేశంలోనే మొదటిసారి అని పేర్కొన్నారు. ఇవి AP ఆర్థికాభివృద్ధికి పడిన పునాది అని వెల్లడించారు.