MBNR: డిసెంబర్ 16న జిల్లా కేంద్రంలోని ఎంపీ చర్చ్‌లో నిర్వహించనున్న క్రిస్టమస్ వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డిని పాస్టర్ రేవా వరప్రసాద్ శుక్రవారం ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహబూబ్ నగర్ జిల్లా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది అన్నారు. ప్రతి పండుగను ప్రజలతో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.