MBNR: అనగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని జడ్చర్ల మాజీ శాసనసభ్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా జడ్చర్ల పట్టణంలోని ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యాభివృద్ధి కోసం అవిశ్రాంతంగా శ్రమించిన వ్యక్తి పూలే అని అన్నారు.