కొన్నాళ్లుగా డిజాస్టర్లతో సతమతమవుతున్న రామ్ పోతినేని.. హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్.. ఆ తర్వాత నటించిన ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంధ’, ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు. తాజాగా ‘ఆంధ్ర కింగ్ తాలూకా’కు వస్తోన్న రెస్పాన్స్ చూస్తూంటే రామ్ ఖాతాలో మరో హిట్ పడినట్లు అర్థమవుతుంది.