TG: కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న విత్తన బిల్లులు రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను హరించేలా ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సర్టిఫికేషన్ అధికారం, నకిలీ విత్తనాలపై నియంత్రణ రాష్ట్రాలకే ఉండాలని పేర్కొన్నారు. రాష్ట్రాలే క్షేత్ర స్థాయిలో పనిచేస్తాయి కాబట్టి ఈ అధికారం రాష్ట్రాలకే ముఖ్యమన్నారు. విత్తన బిల్లుపై సవరణలు అభ్యంతరాలను పంపుతామని స్పష్టం చేశారు.