అమెరికా గ్రీన్ కార్డు కోసం ఎంతోమంది ఎదురుచూస్తుంటారు. అలాంటివారినే లక్ష్యంగా చేసుకుని.. గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలు అని పిలిపించి భద్రతాధికారులు అరెస్టులు చేస్తున్నట్లు సమాచారం. శాన్డియాగోలో గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ కోసం వచ్చిన ఓ వ్యక్తితో పాటు వారి అమెరికన్ భాగస్వామిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అరెస్టుల విషయం వెలుగులోకి వచ్చింది.