KKD: పెదపూడి MPP పాఠశాల జిల్లాస్థాయి ఉత్తమ పాఠశాలగా ఎంపికైంది. ఈ విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు విశ్వనాథం, సత్యనారాయణ శుక్రవారం తెలిపారు. డీఈవో రమేష్ నేతృత్వంలోని అధికారుల బృందం మండలంలోని పలు పాఠశాలలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల విద్యాభివృద్ధిలో పెదపూడి పాఠశాల ముందంజలో ఉండటంతో ఈ గుర్తింపు లభించిందని వారు పేర్కొన్నారు.