TG: జీవో 46పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఈ దశలో పంచాయతీ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోలేమని, స్టే విధించలేమని కోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికల్లో సబ్ కేటగిరి రిజర్వేషన్లపై 6 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రిజర్వేషన్ లేనందుకే ఎన్నికలు రద్దు చేయాలనుకుంటున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. తదుపరి విచారణను 2 నెలలకు వాయిదా వేసింది.