తండ్రికి గుండెపోటు, వేరే యువతితో పలాష్ ముచ్చల్ చాటింగ్స్ నేపథ్యంలో స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లిపై సస్పెన్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, త్వరలోనే మంధానతో ముచ్చల్ వివాహం జరగనున్నట్లు అతని తల్లి అమిత స్పష్టంచేశారు. ఆమెను ఆహ్వానించేందుకు తాను ఏర్పాట్లు కూడా చేశానని, అనుకోని పరిస్థితులతో ఇద్దరూ ఇప్పుడు బాధలో ఉన్నారని తెలిపారు.