ప్రకాశం: చిరుధాన్యాలు సాగు మరింత పెరగాలని అగ్రికల్చర్ ఏవో బుజ్జి బాయ్ అన్నారు. గురువారం మార్కాపురం మండలం ఇడుపూరు గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమాన్ని చేపట్టారు. సమాజంలో మారుతున్న ఆహార అలవాట్లకు అనుగుణంగా రైతన్నలు సాగు పద్ధతులు మార్చుకోవాలని, రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు వంటి వాటికి డిమాండ్ ఉందని రైతులకు అవగాహన కల్పించారు.