MDK: సమాజంలో కుల వివక్ష, అంటరానితనంపై పోరాటం చేసి వెనుకబడిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే అని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులు అర్పించారు. మహిళలకు విద్య అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి పూలే అని ఎంపీ కొనియాడారు.