BHPL: పట్టాలిచ్చిన 37 మంది జర్నలిస్టులకు స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ BHPL జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్టుల రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరింది. ఈ క్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణపతి దీక్షాకారులకు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించారు. వెంటనే జర్నలిస్టులకు కేటాయించిన భూములను, పట్టాలను అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు.