VZM: సాలూరుకు చెందిన సతీష్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని ఓ మహిళా ఉద్యోగి ఎస్పీ కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. కారుణ్య నియామకం కోసం తన వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకున్నాడని ఆరోపించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ ఓ మంత్రి వద్ద అనధికారిక పీఏగా విధులు నిర్వహిస్తున్నాడని ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.