TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇవాళ హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌ను సందర్శించనున్నారు. ఈ క్రమంలో అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. అధికారులతో మాట్లాడి, పనుల పురోగతి, నాణ్యతపై సమీక్షిస్తారు. ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలు, స్టేషన్ భవనం విస్తరణ, ఇతర మౌలిక సదుపాయాలపై సూచనలు చేస్తారు.