KMM: ఖమ్మం జిల్లాలో చాలావరకు గ్రామపంచాయతీల్లో ఏకగ్రీవం వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది. అధికార పక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం ఈ దిశగా ప్రయత్నా లు చేస్తున్నట్లు సమాచారం. సర్పంచ్ స్థానం అధికార పార్టీకి ఇస్తే, ప్రతిపక్ష పార్టీలకు ఉపసర్పంచ్ పదవి ఇవ్వాలని.. తద్వారా ఏకగ్రీవం చేయాలనే భావనలో ఉన్నట్లు తెలిసింది.