సత్యసాయి: జిల్లా YCP అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ నేడు రొద్దం మండలంలోని కలిపి, శేషాపురం, బుదిపల్లి, మరువపల్లి గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద విద్యార్థులకు విద్య, వైద్యం దూరం చేస్తుందని ఆమె విమర్శించారు. చంద్రబాబు బినామీలకు అప్పగించి వైద్య విద్యను వ్యాపారంగా మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.