AP: రాజధాని భూసమీకరణకు లంక భూములిచ్చిన రైతుల సమస్య పరిష్కారమైందని మంత్రి నారాయణ తెలిపారు. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములిచ్చిన రైతుల ప్లాట్లకు రిజిస్ట్రేషన్ మొదలైందని అన్నారు. లంక భూములిచ్చిన రైతులు తమ రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని వెల్లడించారు. గ్రామాల్లోని యూనిట్ ఆఫీసుల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకునే సౌకర్యం ఉందని పేర్కొన్నారు.