KDP: ఎమ్మెల్యే అంటే నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటారని అంటుంటారు. కానీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ అందుకు భిన్నంగా ఉంటారని ప్రజలు చర్చించుకుంటున్నారు. నెలలో అప్పుడప్పుడు మాత్రం నియోజకవర్గంలో ఉంటూ మిగతా రోజులు వ్యక్తిగత పనుల నిమిత్తం హైదరాబాదులో ఉంటారని అంటున్నారు.