ATP: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో ఉమ్మడి అనంత జిల్లాకు వర్ష సూచన ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్ బాబు శుక్రవారం తెలిపారు. రాగల మూడు రోజుల్లో జిల్లాలో వర్షాలు పడవచ్చన్నారు. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు నమోదు కావచ్చని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.