NGKL: జిల్లాలో ఈ రోజు చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలను అధికారులు శుక్రవారం ఉదయం ప్రకటించారు. అమ్రాబాద్ మండలంలో 14.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కల్వకుర్తి మండలం తోటపల్లిలో 14.5, వెల్దండ 14.6, బిజినపల్లి 14.8, తెలకపల్లి 14.9, తాడూరులో 15.0 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.