NDL: సంజామల మండలంలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల కోసం క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎంఈవో వెంకట రమణారెడ్డి తెలిపారు. ఎంఈవో కార్యాలయంలో ప్రభుత్వ వ్యాయామ ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంఈవో మాట్లాడుతూ.. డిసెంబర్ 2 నుంచి ఉపాధ్యాయులకు వివిధ క్రీడా విభాగాల్లో పోటీలను ప్రారంభిస్తున్నట్టు వెల్లడించారు. ఉపాధ్యాయులందరూ పాల్గొనాలన్నారు.