ప్రకాశం: పామూరులోని ETN&L డిగ్రీ కళాశాలలో APSSDC ఆధ్వర్యంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ మీసాల వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో 15 బహుళ జాతి కంపెనీలు పాల్గొంటాయని అన్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమా చదివిన విద్యార్థులు 18 నుంచి 30 సంవత్సరాలలోపు నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలని కోరారు.