KMM: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యాన భక్తుల కోసం ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఖమ్మం RM ఏ.సరిరామ్ అన్నారు. ఈనెల 30 నుంచే ప్రతీ ఆదివారం ఖమ్మం నుంచి మేడారానికి బస్సు సర్వీసు అందుబాటులోకి వస్తుందని, కొత్త బస్టాండ్ నుంచి ఉదయం 6గంటలకు బయలుదేరే ఎక్స్ప్రెస్ బస్సు, తిరిగి మేడారంలో సాయంత్రం 5.30గంటలకు మొదలవుతుందని తెలిపారు.